RC16 : అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఆర్సీ16 మూవీకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇప్పటికే ఉప్పెన మూవీతో తన సత్తా ఏమిటో నిరూపించుకున్న క్రియేటివ్ డైరెక్టర్ ఈసారి రామ్ చరణ్(Ram Charan) ను అద్భుతంగా తెర మీద ప్రజెంట్ చేసేందుకు తంటాలు పడుతున్నాడు. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యం తో వస్తున్న మూవీ. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి కాకుండానే చెర్రీ మూవీ కోసం బయ్యర్స్ ఎగబడటం విశేషం.
Ram Charan’s Birthday Special from RC16 Movie
ఈ ఏడాది ప్రారంభంలో చెర్రీకి కోలుకోలేని షాక్ తగిలింది. భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ తీశాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బొక్క బోర్లా పడింది. రెండు మూడు రోజుల్లోనే తేలి పోయింది. ఇదే సమయంలో రిలీజ్ అయిన రెండు సినిమాలు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం దుమ్ము రేపాయి.
బాలయ్య మూవీ రూ. 130 కోట్లు వసూలు చేస్తే..విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా రూ. 330 కోట్లు వసూలు చేసింది. దీంతో మైండ్ బ్లాంక్ అయ్యింది చెర్రీకి, ఆయన తండ్రి చిరంజీవికి. ఈ ఇద్దరూ కలిసి ఆ మధ్యన ఆచార్య తీశారు. అది కూడా బిగ్ షాక్ ఇచ్చింది. స్టార్స్ ను చూసి సినిమాలు నడవవని తేలి పోయింది. కేవలం కథ బాగుంటేనే సినిమాలను ఆదరిస్తారని ఇటీవల రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ గా నిలిచిన డ్రాగన్ , కోర్ట్ సినిమాలు నిరూపించాయి.
దీంతో బుచ్చిబాబు సన చాలా జాగ్రత్తగా ఆర్సీని తీస్తున్నాడు. ఇందులో చెర్రీతో పాటు జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ , మహేంద్ర సింగ్ ధోనీ నటిస్తుండడం విశేషం. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది.
Also Read : Hero Ram Charan Birthday :హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్