Rakul Preet Singh : తన హెల్త్ పై వస్తున్న వార్తలపై అప్డేట్ ఇచ్చిన రకుల్

దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రకుల్ త్వరగా కోలుకోవాలి....

Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తీవ్రంగా గాయపడింది. జిమ్ లో వర్కవుట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమె గాయపడింది. దీంతో కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్ తీసుకుంటుందీ అందాల తార. అదే క్రమంలో తన హెల్త్ అప్ డేట్ గురించి ఎప్పటికప్పుడుసోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో మరో పోస్ట్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ‘ఆరోగ్యమే మహాభాగ్యం. స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు ఎంత కృతజ్ఞతతో ఉండాలో తరచూ మనం మర్చిపోతుంటాం’ అని అందులో రాసుకొచ్చింది. #LifeLearning ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

Rakul Preet Singh Comment

దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రకుల్ త్వరగా కోలుకోవాలి.. మళ్లీ సినిమా షూటింగుల్లో బిజీ కావాలంటూ కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు 2’లో కీలక పాత్ర లో నటించింది రకుల్‌. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే 2’ లో నటిస్తోందీ అందాల తార.

Also Read : Prabhas : పాన్ ఇండియా స్థాయిలో డార్లింగ్ సినిమాల రి రిలీజ్

CommentsIndian ActressesRakul Preet SinghUpdatesViral
Comments (0)
Add Comment