Rakul Preet Singh Shocking :అందుకే స్టార్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించా

ప్ర‌ముఖ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్

Rakul Preet Singh : ఒక‌ప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఫోక‌స్ పెట్టిన న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సంద‌ర్బంగా స్టార్ డైరెక్ట‌ర్ నుంచి త‌న‌కు న‌టించాలంటూ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, కానీ అనుకోకుండా ఆ ఛాన్స్ పోగుట్టుకున్నాన‌ని చెప్పింది. చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది త‌ను. ఆ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు పూరీ జ‌గ‌న్నాథ్ అంటూ రివీల్ చేసింది. త‌న కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని పేర్కొంది.

Rakul Preet Singh Shocking Comments

ఈ సంద‌ర్బంగా త‌న తొలి రోజుల గురించి ప్ర‌త్యేకంగా గుర్తు చేసుకుంది. నేను చ‌దువుకుంటున్న స‌మ‌యంలో మోడ‌లింగ్ ప్రారంభించానన‌ని చెప్పింది. చివ‌ర‌కు క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు తొలి సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని వెల్ల‌డించింది. ఆ స‌మ‌యంలో ద‌క్షిణాది చిత్రాల‌కు సంబంధించి త‌న‌కు పెద్ద‌గా ప‌రిచయం లేద‌న్నారు. దీంతో నిర్ణ‌యం తీసుకునేందుకు కొంత స‌మ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. చిత్ర యూనిట్ త‌న తండ్రిని సంప్ర‌దించి ప్రాజెక్టు గురించి వివ‌రించార‌ని తెలిపింది.

ఆ మూవీ త‌న‌కు గుర్తింపు తెచ్చి పెట్టింద‌న్నారు. చ‌దువుతో పాటు న‌ట‌న‌ను నిర్వ‌హించేందుకు క‌ష్టంగా మారింద‌న్నారు ర‌కుల్ ప్రీత్ సింగ్. దీని కార‌ణంగా తొలినాళ్ల‌ల్లో సినిమాల‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో పూరీ జ‌గ‌న్నాథ్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. మూవీకి సంబంధించి 70 రోజుల పాటు కాల్ షీట్స్ అడిగార‌ని, దీంతో చ‌దువుపై దృష్టి పెట్టాల్సి ఉండ‌డంతో తాను సినిమాలో న‌టించేందుకు ఇష్ట ప‌డ‌లేదంటూ పేర్కొంది.

Also Read : Hero Bunny-Aarya Movie :22 ఏళ్లు పూర్తి చేసుకున్న సుకుమార్..బ‌న్నీ మూవీ

CommentsMoviesRakul Preet SinghViral
Comments (0)
Add Comment