Rakul Preet Singh: గోవాలో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ! 

గోవాలో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ! 

గోవాలో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ! 

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. గత కొంతకాలంగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు వివాహ బంధంలోనికి అడుగుపెట్టింది. దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది. రకుల్, జాకీ కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు ఈ పెళ్లికి హాజరయ్యారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍ తో పాటు బాలీవుడ్‌ కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో రకుల్ – జాకీ వివాహం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్, జాకీ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఫిబ్రవరి 19 నుండి దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే పార్టీలు, ఫంక్షన్లు గ్రాండ్‍ గా సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. మంగళవారం సంగీత్ ఫంక్షన్ జరిగింది. బుధవారం రకుల్ – జాకీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమికులయ్యారు. తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్‌లో రకుల్ – జాకీ ప్రకటించారు. రకుల్ పుట్టిన రోజునే ఈ విషయాన్ని వెల్లడించారు.

Jockky BhagnaniRakul Preet Singh
Comments (0)
Add Comment