Rakul Preet Singh: అల్లు అరవింద్ ‘రామాయణం’ లో శూర్పణఖగా రకుల్..?

అల్లు అరవింద్ 'రామాయణం' లో శూర్పణఖగా రకుల్ ?

Rakul Preet Singh: అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు నితేశ్‌ తివారీ త్వరలో తెరకెక్కించబోయే భారతీయ ఇతిహాసం ‘రామాయణం’. మూడు భాగాలుగా నిర్మాణం చేపట్టబోయే ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యశ్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్, సీత పాత్రలో సాయిపల్లవి లేదా జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తన వాయిస్ మాడ్యులేషన్ కోసం రణ్ బీర్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మరోక కీలక పాత్ర అయిన శూర్పణఖ కోసం దర్శకుడు నితేశ్… రకుల్ ప్రీత్ ను సంప్రదించారని బీ టౌన్ సమాచారం. దీనికి రకుల్(Rakul Preet Singh) కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. దీనితో రకుల్ ప్రీత్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Rakul Preet Singh Movie Updates

ప్రస్తుతం తన పెళ్ళి విషయాలతో సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్న రకుల్(Rakul Preet Singh)… ‘రామాయణం’ లో శూర్పణఖ పాత్రకు ఎంపిక అయినట్లు పుకార్లు షికార్లు చేయడంతో… ఒక్కసారిగా ఈమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ తో రకుల్‌ పెళ్లి ఫిబ్రవరి 22న గోవాలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలయ్యాయంటున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రకుల్‌ తన స్నేహితులకు గోవాలో పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘రామాయణం’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు భాగాల్లో ఈ సినిమాను తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారు. దీని వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌… ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ మరికొంతమంది బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు.

Also Read : Fighter: ‘ఫైటర్‌’ ముద్దుసీన్‌ వివాదంపై స్పందించిన దర్శకుడు ?

Rakul Preet SinghRamayanam
Comments (0)
Add Comment