Rakul Preet Singh: మళ్లీ సౌత్ పై కన్నేసిన స్లిమ్ బ్యూటీ !

మళ్లీ సౌత్ పై కన్నేసిన స్లిమ్ బ్యూటీ !

Rakul Preet Singh: కెరటం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి… లౌక్యం, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, దృవ, ఖాకీ వంటి సినిమాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి రకుల్ ప్రీత్(Rakul Preet Singh). అయితే గత రెండేళ్ళుగా సౌత్ సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ పంచాబీ బ్యూటీ… బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈమె సౌత్ లో సినిమా చేసి దాదాపు రెండేళ్లు దాటింది. ఇటీవల ఓ సినిమా చేసినప్పటికీ అది థియేటర్లలోకి రాకుండా, నేరుగా ఓటీటీలో రిలీజైంది. దీనితో ఆమెకు సౌత్ లో లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అయితే మళ్ళీ రెండేళ్ళ తరువాత సౌత్ పై ఫోకస్ పెట్టింది ఈ పంజాబీ బ్యూటీ. ప్రస్తుతం శంకర్ దర్వకత్వంలో ఇండియన్-2, శివకార్తికేయన్ సరసన అయలాన్ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Rakul Preet Singh Viral

హీరో కార్తితో కలిసి నటించిన ఖాకీ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా ఖాకీ-2ను తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఖాకీ సినిమాలో రకుల్ ప్రీత్ పాత్ర చనిపోయినప్పటికీ… ఖాకీ-2లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండటంతో ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి రకుల్ ను తీసుకునే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. ఈ మేరకు రకుల్ తో చిత్ర యూనిట్ డిస్కషన్ కూడా జరిగినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనితో ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చి… మళ్ళీ సౌత్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఆమె ఇంకా ఎలాంటి కొత్త సినిమాలకూ కమిట్ అవ్వలేదు. కొత్త ఏడాదిలో రకుల్ నుంచి తెలుగు సినిమా ప్రకటన రావడం గ్యారెంటీ అని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Also Read : Devil Talk : కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా హిట్టా..?

Rakul Preet Singh
Comments (0)
Add Comment