Rakul Preet Singh: మోదీ పిలుపుతో తన వివాహ వేదిక మార్చుకున్న రకుల్‌ ప్రీత్‌ ?

మోదీ పిలుపుతో తన వివాహ వేదిక మార్చుకున్న రకుల్‌ ప్రీత్‌ ?

Rakul Preet Singh: దేశంలో సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఆశక్తి చూపిస్తున్నారు. విదేశాల్లో పెళ్ళి చేసుకుని కావాలంటే ఇక్కడ అతిధులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), జాకీ భగ్నానీ పెళ్ళి పీటలు ఎక్కడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో… వీరు కూడా ఏ యూరోప్, మిడిల్ ఈస్ట్ లో పెళ్ళి చేసుకుంటారని అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 22న పెళ్ళి చేసుకోబోతున్న ఈ జంట అనూహ్యంగా వివాహ వేదికను గోవాకి మార్చిందట. విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్న వీరు తర్వాత నిర్ణయం మార్చుకున్నారని, గోవాలో చేసుకునేందుకు ఫిక్స్‌ అయ్యారని తెలిసింది.

Rakul Preet Singh Comment

దీనికి కారణం భారత ప్రధాని నరేంద్రమోదీ అని సమాచారం. ఇటీవల విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవాలనుకునే భారతీయ జంటకు మోదీ కీలక సూచన చేసారు. తమ జీవితంలో నూతన ప్రయాణాన్నివిదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. భారత్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేశారా ? అని దేశంలోని సంపన్న కుటుంబాల వారిని మోదీ ప్రశ్నించారు. అంతేకాదు ‘మేకిన్‌ ఇండియా’ తరహాలో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ ప్రారంభం కావాలన్నారు. దీనితో ప్రధాని మోదీ పిలుపు మేరకు రకుల్, భగ్నానీల జంట తమ పెళ్ళి వేదికను గోవాకు మార్చిందని సమాచారం.

‘‘రకుల్‌- జాకీ భగ్నానీ మిడిల్‌ ఈస్ట్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇండియాలో చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారు’’ అని రకుల్‌, భగ్నానీ సన్నిహిత వర్గాలు తమకు చెప్పినట్లు ఓ నేషనల్ మీడియా సంస్థ పేర్కొంది. దీనితో రకుల్,భగ్నానీ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పెళ్ళి, మరోవైపు వెడ్ ఇన్ ఇండియా అభినందనలతో రకుల్, భగ్నానీల జంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

కెరటం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి… వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, దృవ, ఖాకీ వంటి సినిమాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి రకుల్ ప్రీత్. ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె కీలక పాత్ర పోషించిన ‘భారతీయుడు 2’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read : Nikhil Siddharth: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో !

Jockky BhagnaniRakul Preet Singh
Comments (0)
Add Comment