Rakul Preet Singh : గత ఏడాది సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. ఈ సందర్బంగా తనను తన భర్త ఎంతగా ప్రేమిస్తున్నాడో తను ఇస్తున్న గిఫ్ట్ లను చూస్తే తెలుస్తుందని అంటోంది. వీరిద్దరూ ఒక్కటయ్యాక ప్రతి నిత్యం జీవితంలోని మధురానుభూతులను ఆస్వాదిస్తున్నారు. ఆనందమయంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Rakul Preet Singh Got Surprise Gift
ఈ తరుణంలో ఉన్నట్టుండి తాజాగా మరోసారి సర్ ప్రైజ్ చేశాడు భర్త జాకీ భగ్నానీ. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. తనను జీవితంలో మరిచి పోలేనంటూ పేర్కొంది. తనకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం తన భర్త అంటూ తెలిపింది. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకుంది.
విచిత్రం ఏమిటంటే రకుల్ ప్రీత్ సింగ్ కు మనసు దోచుకునే అరుదైన గులాబీ పూలను అందించాడు.
పూలు తెచ్చిన తర్వాత తన పారవశ్య ముఖాన్ని ప్రదర్శించింది. తాను అతన్ని చాలా ప్రేమిస్తున్నానని చెబుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా ఫిబ్రవరి 21న, రకుల్ , జాకీ ఒక సంవత్సరం వైవాహిక ఆనందాన్ని జరుపుకున్నారు. నువ్వు లేకుండా, రోజులు రోజులుగా అనిపించవు. నువ్వు లేకుండా, అత్యంత రుచికరమైన ఆహారం తినడం సరదాగా ఉండదు అంటూ పేర్కొంది ప్రేమగా రకుల్ ప్రీత్ సింగ్. మనిద్దరం కలిసి అప్పుడే ఏడాదైందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది ముద్దుగుమ్మ.
Also Read : Kumbh Mela- Sensational Floating :కుంభ మేళా ఉత్సవం పోటెత్తిన భక్తజనం