Rakhi Sawant : రాఖీ సావంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నిత్యం వివాదాస్పద వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరో సంచలన కామెంట్స్ చేసింది. అదేమిటంటే తన మాజీ భర్త తనను న్యూడ్ గా వీడియోలు తీశాడని, వాటిని రూ. 47 లక్షలకు అమ్ముకున్నాడంటూ ఆరోపించింది.
Rakhi Sawant Slams her Ex
అదిల్ ఖాన్ దురానీని రహస్యంగా పెళ్లి చేసుకుంది రాఖీ సావంత్. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ విడి పోయింది. తనపై పలు కేసులు పెట్టింది. మరో కీలక వ్యాఖ్యలు చేసింది. తను స్నానం చేస్తుండగా, దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
భర్త కాబట్టి తను సరదా కోసం అలా తీశాడేమోనని అనుకున్నానని కానీ తీరా చూస్తే ఆ వీడియోలు పూర్తిగా న్యూడ్ గా ఉన్నాయని వాపోయింది. విషయం తెలుసుకునే సరికి తనకు మతి పోయినంత పనైందని తెలిపింది.
కారణం అంతా బూతే ఉందని , వాటిని భారీ ధరకు అమ్ముకున్నాడని, సొమ్ము చేసుకున్నాడంటూ కన్నీటి పర్యంతం అయ్యింది ఈ ముద్దుగుమ్మ రాఖీ సావంత్(Rakhi Sawant).
దీంతో ప్రస్తుతం నేను మౌనంగా ఉన్నాను. నిస్సహాయురాలిగా మారాను. లోకమంతా నా న్యూడ్ వీడియోలను చూసింది. నేను ఎలా ముఖం చూపించాలని కన్నీటి పర్యంతం అయ్యింది రాఖీ సావంత్. ఇండియాలో నాకంటూ ఓ బ్రాండ్ ఉందని పేర్కొంది.
Also Read : Karthikeya Praise : అజిత్ ప్రచారం కోరుకోడు