Rakhi Sawant: ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా ఘనంగా జరిగాయి. మార్చి 1 నుండి 3 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు వ్యాపార, రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హాలీవుడ్ పాప్ సింగ్ రిహానాతో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ హీరోలు, హీరోయిన్లు ఆట పాటలతో సందడి చేసారు. ఖాన్స్ త్రయంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు స్టెప్ వేసి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Rakhi Sawant Comments
అదే సమయంలో వేదికపై వరుడు అనంత్ అంబానీ ఇచ్చిన స్పీచ్ అతిథితులతో పాటు సామాన్యులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. అనారోగ్య సమస్యలతో తాను బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్ వేడుకలోనే ఎమోషనల్ అయ్యాడు. తన ప్రతీ విజయం వెనుక తన తల్లిదండ్రుల కృషి, ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. అదే సమయంలో రాధిక మర్చంట్ తనకు దగ్గరైన నాటి నుండి తాను అనుభవిస్తున్న ఆనంద క్షణాలు, రాధిక కుటుంబంలో భాగస్వామిగా మారిత తరువాత వారు చూపిస్తున్న ప్రేమాభిమాలు గురించి వివరిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రీ వెడ్డింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ క్రమంలో అంబానీ ఫంక్షన్ పై వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Sawant) స్పందించింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదని ముకేశ్ అంబానీను ఆమె ప్రశ్నించింది. ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసేదానినంటూ ఆమె ఇలా పేర్కొంది. ‘అంబానీ జీ నమస్తే. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు ? మీరు ఇంకా నా డ్యాన్స్ చూడలేదనుకుంటా.. మీరు సింగర్ రిహానాతో పాటుగా ఈ ఖాన్, ఈ ఖాన్ అంటూ ఎందరినో పిలిచారు.
మీ వేడుకలో వారు చేసిన డ్యాన్స్ నా ముందు జుజూబీ… మీరు నా డాన్స్ చూశారా ? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా. మీరు కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి వుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగేవి. మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు కడిగే వరకు అన్నీ నేనే చేసేదాన్ని. అంటూ రాఖీ సావంత్(Rakhi Sawant) కామెంట్ చేసింది.
అనంత్ బరువుపై రాఖీ సావంత్ కామెంట్ !
అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్(Rakhi Sawant) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ‘డియర్ అంబానీ జీ… అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు… ఆయన్ను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా… తృప్తి చేసి పంపిస్తాను. అనంత అంబానీని జీరో సైజ్‌కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటుగా మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది.’ అని అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది.
దీంతో రాఖీ సావంత్(Rakhi Sawant) తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్ వేడుకలోనే ఎమోషనల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్‌గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆయన అమ్మగారు అయిన నీతా అంబానీ కూడా అనంత్ ఆరోగ్య సమస్యల గురించి గతంలో వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్ బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి అనంత్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడుతున్నారు.
Also Read : Hansika Motwani : ‘గార్డియన్’ అనే మరో హర్రర్ సినిమాతో వస్తున్న హన్సిక