Rakesh Roshan- Hero Hrithik-Krish 4 :ద‌ర్శ‌కుడిగా మారిన స్టార్ హీరో

సీక్వెల్ గా రానున్న క్రిష్ మూవీ

Rakesh Roshan : బాలీవుడ్ ను షేక్ చేసిన సినిమాల‌లో షోలే త‌ర్వాత క్రిష్ చిత్రమేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. రాకేశ్ రోష‌న్ దీనిని తెర‌కెక్కించాడు. ఈ ఒకే ఒక్క మూవీతో హృతిక్ రోష‌న్ దేశ వ్యాప్తంగా టాప్ హీరో గా పేరు పొందాడు. క్రిష్ కు సీక్వెల్ గా మొత్తం తొలిదానితో క‌లిపి మూడు వ‌చ్చాయి ఇప్ప‌టి వ‌ర‌కు. ఈ మూడు సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచాయి. ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా రాకేశ్ రోష‌న్(Rakesh Roshan) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. క్రిష్ కు కొన‌సాగింపుగా సీక్వెల్ మూవీ రాబోతోంద‌ని ప్ర‌క‌టించాడు.

Rakesh Roshan Comment

అయితే ఫ్యాన్స్ కు మ‌రో స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈసారి తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం లేద‌ని తెలిపాడు రాకేశ్ రోష‌న్. త‌న స్థానంలో న‌టుడు హృతిక్ రోష‌న్(Hrithik Roshan) న‌టించ‌డంతో పాటు డైరెక్ష‌న్ చేస్తాడ‌ని వెల్ల‌డించాడు. ఆయ‌న చేసిన తాజా ప్ర‌క‌ట‌న చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే సినిమా ఫ్రేమ్స్ 24 పై మంచి ప‌ట్టు క‌లిగి ఉన్నాడు హృతిక్ రోష‌న్. రాకేశ్ రోష‌న్ త‌న‌కు తండ్రి కావ‌డం విశేషం.

ఈ ఇండియ‌న్ సూప‌ర్ హీరో యాక్ష‌న్ తో పాటు ద‌ర్శ‌క‌త్వం కూడా చేయ‌బోతుండ‌డంతో అంచ‌నాలు ఇప్ప‌టి నుంచే మొద‌లు అయ్యాయి. ఇక సీక్వెల్ 4 చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఆదిత్యా చోప్రా నిర్మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇంకో విశేషం ఏమిటంటే 25 ఏళ్ల త‌ర్వాత క‌లిసి సినిమాను చేయ‌బోతుండ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు రాకేశ్ రోష‌న్. కాగా క్రిష్ 2013లో విడుద‌లైంది.

Also Read : Hero Shahid Kapoor-Pooja :నెట్ ఫ్లిక్స్ లో షాహిద్ ..పూజా హెగ్డే దేవా

CinemaHrithik RoshanKrish 4Rakesh RoshantrendiUpdates
Comments (0)
Add Comment