Vettaiyan Movie : సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వెట్టయాన్’ సినిమా కోర్టు నోటీసులు

సెప్టెంబర్ 20న వేట్టయాన్ ప్రివ్యూ పేరుతో చిత్రయూనిట్ టీజర్‌ను విడుదల చేయగా....

Vettaiyan : జై భీమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వేట్టయాన్(Vettaiyan). ఈ మూవీలో మలయాళీ బ్యూటీ మంజువారియర్, ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో తలైవా లుక్, డైలాగ్స్, యాక్షన్ అదిరిందని.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

Vettaiyan Movie Updates

సెప్టెంబర్ 20న వేట్టయాన్ ప్రివ్యూ పేరుతో చిత్రయూనిట్ టీజర్‌ను విడుదల చేయగా.. దానిలో అత్యంత భయంకరమైన క్రిమినల్స్‌ను ఏమాత్రం భయపడకుండా ఎన్‌కౌంటర్ చేయడం వల్ల వీళ్లు హీరోలు అయ్యారంటూ కొన్ని సంభాషణలు ఉండటంపై సదరు పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి చట్టవిరుద్ధంగా ఎన్ కౌంటర్స్ ప్రోత్సహించేలా ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చేలా ఉన్నాయన్నారు. ఆ సంభాషణలను తొలగించడం లేదా మ్యూజ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు సదరు పిటిషనర్. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సీబీఎఫ్‌ఎసీ, లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు జారీ చేసింది. సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న విన్నపాన్ని మాత్రం తోసిపుచ్చింది. సీబీఎఫ్‌సీ, లైకా ప్రొడక్షన్స్ స్పందనను బట్టి తదుపరి విచారణ ఉండనుంది.

Also Read : Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్

BreakingCinemaSuper Star RajinikanthUpdatesVettaiyanViral
Comments (0)
Add Comment