Rajinikanth: ‘జై భీమ్’ సినిమా ఫేం టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘వెట్టయాన్’. ఇందులో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘వేట్టయాన్ ’ పై అభిమానులకు భారీగా అంచనాలు ఉన్నాయి. ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత… బూటకపు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారిగా రజనీకాంత్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
Rajinikanth Movie Updates
దీనితో ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ చెప్పడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. అయితే దీని విడుదల తేదీపై ఇంత వరకు స్పష్టత రాకున్నా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం తమిళ చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబరు నెలాఖరున థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ అంశంపైనే చిత్ర వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో క్రైమ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ముస్తాబైనట్లు తెలిసింది. ఈ సినిమాకి మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా… సినిమాటోగ్రాఫర్ గా ఎస్.ఆర్.కతీర్ వ్యవహరిస్తున్నారు.
Also Read : Varalaxmi Sarathkumar: దక్షిణ భారత సంప్రదాయ పద్ధతుల్లో లేడీ విలన్ వరలక్ష్మి వివాహం !