Rajinikanth-Modi : ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన తలైవా

సూపర్ స్టార్ రజనీకాంత్ సెప్టెంబర్‌ 30న అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు...

Rajinikanth : మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో.. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ ‘ఎక్స్’ ద్వారా రజనీకాంత్(Rajinikanth) స్పందిస్తూ.. ‘‘నా హెల్త్ పట్ల ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి.. ఫోన్ చేసి మరీ పరామర్శించిన ప్రధాని నరేంద్రమోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్‌కు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు కూడా ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అలాగే తన కోసం ప్రార్థించిన అభిమానులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రజనీకాంత్ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Rajinikanth Comment….

సూపర్ స్టార్ రజనీకాంత్ సెప్టెంబర్‌ 30న అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రజనీకాంత్‌(Rajinikanth)ని పరీక్షించిన డాక్టర్లు.. ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించి.. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. రజనీకాంత్ హెల్త్ సరికావడంతో ఉండటంతో ఆయనను గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. అయితే కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు రజనీకాంత్‌కు సూచించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్‌’ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం రజనీ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం అయితే లేదు. రజనీ లేకుండానే ఇకపై ఈ సినిమా ప్రమోషన్స్ జరగనున్నాయి. టి.జె. జ్ఞానవేల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని పూర్తి చేసిన రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు.

Also Read : Thalapathy 69 : థలపతి విజయ్ చివరి సినిమా ఓపెనింగ్ లో కీలక అంశాలు

CommentPM Narendra ModirajinikanthUpdatesViral
Comments (0)
Add Comment