Rajinikanth : జస్టిస్ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ పై స్పందించిన ‘తలైవా’

ఈ విషయంపై తమిళ సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి...

Rajinikanth : సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది. ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చి చెబుతున్నారు పలువురు నటీమణులు. కొందరు సీనియర్ నటులు తమతో అసభ్యకరంగా మాట్లాడారని.. తమపై దాడులు చేశారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరు నటులపై కేసు నమోదైంది. అలాగే మలయాళీ ఇండస్ట్రీలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరిగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే హేమ కమిటీ నివేదికపై తమిళం, మలయాళం, కన్నడ సెలబ్రెటీలు స్పందించి ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) స్పందించారు. కేరళలో పెను దుమారాన్ని సృష్టిస్తోన్న హేమ కమిటీ నివేదికపై మోహన్‌లాల్, మమ్ముట్టి తదితరులు వివరణ ఇచ్చారు.

Rajinikanth Comment

ఈ విషయంపై తమిళ సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోలీవుడ్ లోనూ ఓ కమిటీ వేయాలని తమిళ నటుడు విశాల్ అన్నారు. ఈ విషయం గురించి తనకు ఏమాత్రం తెలియదని చెబుతూ.. సారీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తమిళ సినీ పరిశ్రమకు కమిటీ అవసరమా? లేదా అన్నది కూడా తెలియదు సూపర్ స్టార్ రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలో పెను దుమారం సృష్టిస్తోన్న విషయం రజినీకి తెలియకపోవడం ఏంటీ ? అంటూ విమర్శలు చేస్తున్నారు.

మలయాళీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు జయసూర్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అదేవిధంగా నటుడు సిద్ధిక్‌, దర్శకుడు రంజిత్‌పై కూడా కేసు నమోదు చేయనున్నారు. కేరళలో హేమ కమిటీ నివేదిక వెలువడడంతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది. నటీమణులు రాధికా శరత్‌కుమార్, ఖుష్బూ, రంజని, అమలాపాల్, సమంత కూడా ఈ నివేదికపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఈ విషయంపై కేరళ సీనియర్ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి మౌనంగా ఉన్నారు. విమర్శల అనంతరం మోహన్‌లాల్‌, మమ్ముట్టి హేమ కమిటీ నివేదికపై స్పందించారు. కేరళ హేమ కమిటీ నివేదిక గురించి తనకు ఏమీ తెలియదని చెప్పడంతో రజినీ తీరుపై మండిపడుతున్నారు కొందరు నెటిజన్స్. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్నారు రజినీ.

Also Read : Chiranjeevi : తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

BreakingHema CommitteeSuperstar RajinikanthUpdatesViral
Comments (0)
Add Comment