ఇది కదా స్పోర్టివ్ అంటే. తను సినిమాలోనే కాదు నిజ జీవితంలో రియల్ స్టార్ అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు తలైవాగా పిలుచుకునే రజనీకాంత్. తను నటించిన జైలర్ బిగ్ సక్సెస్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ. 650 కోట్లు కొల్లగొట్టింది. ఇదే సమయంలో మరో కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు రజనీకాంత్.
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నది ఎవరో కాదు జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్. ఇది కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో విడుదల కానుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ కావాలని పిలుపునిచ్చాడు రజనీకాంత్. ఈ చిత్రంలో తళపతి విజయ్ తో పాటు త్రిష కృష్ణన్ , సంజయ్ దత్ నటించారు.
ఇప్పటికే ముందస్తు టికెట్ల విక్రయంలో రికార్డుల మోత మోగిస్తోంది. ఇటు ఇండియాతో పాటు ఓవర్సీస్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటి దాకా రికార్డులు క్రియేట్ చేసిన అన్ని సినిమాలను తలదన్ని లియో నిలిచింది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్ , విజయ్.