Rajinikanth : తలైవా పై మండిపడ్డ వృద్ధురాలు.. వైరల్ అవుతున్న వీడియో

Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడులో తలైవాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పుట్టినరోజులు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రజనీ ఇంటికి అభిమానులు పోటెత్తుతారు. తమ హీరోని ఒక్కసారి కలుసుకుని వెళ్ళిపోవాలని తహతహలాడుతుంటారు. తలైవా కూడా తన అభిమానులను నిరుత్సాహపరచకుండా ఇంటి నుండి బయటకు వెళ్లి అందరినీ పలకరించి వెళ్లిపోతారు.

సోమవారం (జనవరి 15) సంక్రాంతి సందర్భంగా రజనీకాంత్ ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రోజు తెల్లవారుజామున, చెన్నైలోని పోస్‌గుర్డ్‌లోని సూపర్‌స్టార్(Rajinikanth) ఇంటి వెలుపల వేలాది మంది అభిమానులు బారులు తీరారు. ఎప్పటిలాగే రజనీ బయటకు వచ్చి పలకరించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నట్టు చెప్పారు. అంకితభావంతో, చిత్తశుద్ధితో ముందుకి నడవాలని అభిమానులను ప్రోత్సహించారు. అప్పుడే మీ జీవితం సాఫీగా సాగుతుందని అన్నారు.

Rajinikanth Viral

తమ అభిమాన హీరో బయటకు వచ్చి పలకరించడంతో రజనీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “తలైవా, తలైవా” అని అరిచారు. దీంతో రజనీ ఇంటి చుట్టూ సందడి వాతావరణం నెలకొంది. ఇది విన్న రజనీకాంత్ ఇంటి పక్కనే ఉన్న ఓ వృద్ధురాలు ఉలిక్కిపడింది. ఇదేం గొడవ అంటూ “మమ్మల్ని ప్రశాంతంగా సంక్రాంతి పండగను జరుపుకోనివ్వరా అంటూ మండి పడ్డారు”. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు, అభిమానులతో వాగ్వాదానికి దిగారు. ‘ఎం మీ (రజనీకాంత్) ఇంటి తలుపు తెరిచి అభిమానులను లోనికి పిలిపించుకోవచ్చుగా. మేము కూడా ఇంటి పన్ను చెల్లిస్తున్నాము. అన్న ఉపయోగం లేకుండా పోయింది. ఇంటి ముందు ఫ్యాన్స్ నిలబడి పెద్ద శబ్దాలు చేస్తున్నారు. ప్రశాంతంగా భగవంతుడిని ప్రార్థించలేకపోతున్నాం అంటూ ఆవిడ ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read : Saindhav Movie : వెంకీ మామ సినిమాకి అమెరికాలో భారీ వసూళ్లు

BreakingCommentsrajinikanthViral
Comments (0)
Add Comment