Rajinikanth: భర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తానంటున్న తలైవా !

భర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తానంటున్న తలైవా !

Rajinikanth : ‘జైలర్‌’తో హిట్టు కొట్టి జోరు మీదున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్‌. ప్రస్తుతం ఆయన ‘జై భీమ్’ సినిమా ఫేం టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘తలైవా 170’ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారు. మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో భారతదేశంలోనే అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. బూటకపు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారిగా రజనీకాంత్(Rajinikanth) ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం.

Rajinikanth – డిసెంబరు 12న రజనీ కొత్త సినిమా అప్ డేట్స్ ?

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘తలైవా 170’పై అభిమానులకు భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు పలు కీలక అంశాలను… ఈ నెల 12న రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ రితికా సింగ్ గాయపడిన విషయం తెలిసిందే…. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ప్రస్తుతం కన్యాకుమారిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2024లో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Actor Leelavathi: కన్నడ సీనియర్‌ నటి లీలావతి కన్నుమూత

rajinikanthtaliva 170
Comments (0)
Add Comment