తమిళ సినీ ఇండస్ట్రీలో ఆయనకు 73 ఏళ్లు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడా అహంభావం అన్నది కనపించకుండా జాగ్రత్త పడతారు ఆయనే జగమెరిగిన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. కోట్లాది మంది అభిమానులు కలిగిన స్టార్ గా గుర్తింపు పొందాడు తలైవా.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తను నటించిన జైలర్ రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ ఏకంగా రూ.100 కోట్ల చెక్కును ఎంపీ కళానిధి మారన్ స్వయంగా అందజేశాడు. ఇది ఓ సెన్సేషన్ గా మారింది. అంతే కాదు ఖరీదైన కారు కూడా ఇచ్చారు.
మరో వైపు అద్భుతమైన సినిమాను అందించడమే కాకుండా బాక్సులు బద్దలు కొట్టేలా చేసినందుకు గాను డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు బ్లాంక్ చెక్కు ఇచ్చారు నిర్మాత. ఓ కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక సినిమాకు జనరంజకమైన మ్యూజిక్ అందించినందుకు గాను సంగీత దర్శకుడు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ కు రూ. 30 కోట్లు ఇచ్చినట్లు టాక్.
తాజాగా జైలర్ మూవీ సక్సెస్ సందర్బంగా ఏర్పాటైన ఈవెంట్ కు వెళుతున్న రజనీకాంత్ ను మీడియా ఇలా చుట్టుముట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.