Rajinikanth-Kalki : కల్కి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన తలైవా

కల్కి సినిమా చూశాను... ఇది అద్భుతంగా ఉంది. ఇదొక పురాణ చిత్రంలా అనిపిస్తుంది...

Rajinikanth : నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కల్కి’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై సినీ, రాజకీయ వర్గాల నుంచి పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాపై తలైవర్ రజనీకాంత్(Rajinikanth) ట్విట్టర్ వేదికగా స్పందించారు. కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో అరుదుగా స్పందించే రజనీ ‘కల్కి’ టీమ్‌ని ప్రశంసించడంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Rajinikanth-Kalki..

కల్కి సినిమా చూశాను… ఇది అద్భుతంగా ఉంది. ఇదొక పురాణ చిత్రంలా అనిపిస్తుంది. నాగాశ్విన్ భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. “రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నాను” అని రజనీకాంత్ చెప్పారు. పోస్ట్‌పై స్పందించిన నాగ్ అశ్విన్ రిప్లయ్ ఇచ్చారు. “మొత్తం టీమ్ తరపున ధన్యవాదాలు” అని నాగ్ రాశారు.

అక్కినేని నాగార్జున కూడా తన సోషల్ మీడియా వేదికగా టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నాగ్ అశ్విన్ ఈ సినిమాతో మిమ్మల్ని ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్ళారు. పురాణాలు, చరిత్రలతో కూడిన కథను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. అమితాబ్ మీరే అసలైన మాస్ హీరో అని, మీ నటనతో మరోసారి నిరూపించుకున్నారు. పార్ట్ టూలో కమల్ హాసన్ పాత్రను పరిపూర్ణంగా చిత్రీకరిస్తాడని ఎదురుచూస్తున్నాను” అని అతను చెప్పాడు. ప్రభాస్, మీరు మీ విలువను మరోసారి నిరూపించుకున్నారు. దీపిక చాలా బాగా చేసింది. మీరందరూ కలిసి భారతీయ సినిమా స్థాయిని మరోసారి ప్రదర్శించారు’’ అని కొనియాడారు. హాలీవుడ్ కూడా కల్కి సినిమాను మెచ్చుకుంది. కల్కి అద్భుతంగా ఉందని ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ డెడ్‌లైన్ తెలిపింది.

Also Read : Varalaxmi Invites : ప్రధాని మోడీని తన వివాహానికి ఆహ్వానించిన వరలక్ష్మి శరత్ కుమార్

Kalki 2898 ADPraisesrajinikanthTrendingUpdatesViral
Comments (0)
Add Comment