Jailer 2 : తమిళ సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన ఏకైక నటుడు తలైవా రజనీకాంత్(Rajinikanth). తను ఏది చేసినా ఓ సంచలనమే. ప్రస్తుతం కూలీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పక్కాగా రూ. 2000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ప్రకటించాడు నటుడు సందీప్ కిషన్. తను షూటింగ్ సందర్బంగా రజనీకాంత్ ను కలుసుకున్నాడు. ప్రత్యక్షంగా చూశానని, తన రెండు కళ్లు చాలలేదన్నాడు . తలైవా నటన గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు.
Jailer 2 Shooting Updates
తాజాగా ఇప్పటికే కీలక అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్ తలైవా నటిస్తున్న జైలర్ మూవీ గురించి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. భారీ వసూళ్లను సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో కాసులు కొల్లగొట్టింది. దీంతో జైలర్ -2 సీక్వెల్ తీస్తున్నట్లు డిక్లేర్ చేశారు.
మార్చి 10వ తేదీ సోమవారం చెన్నై నగరంలో రజనీకాంత్ తో షూటింగ్ మొదలు పెట్టాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. తన జీవితంలో ఒక్క సినిమా అయినా తలైవాతో తీయాలని అనుకున్నానని, కానీ ఇప్పుడు తనతో మరో చిత్రాన్ని ప్రారంభిస్తానని కలలో కూడా అనుకోలేదన్నాడు దర్శకుడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు జైలర్ -2ను. ఇది భారత దేశ సినీ చరిత్రలో రికార్డ్ సృష్టించడం ఖాయమని ప్రకటించాడు దర్శకుడు.
Also Read : Hero Ranbir Kapoor Ramayan : శరవేగంగా రామాయణ్ షూటింగ్