Rajinikanth : కొందరికీ కొన్ని కొన్ని బోల్డ్ లోనే ఉంటాయంటారు. రజినీకి స్టైల్ కూడా అలానే ఉన్నట్టుంది. అందుకే ఆయన సినిమాల్లోనే కాదు.. బయట నడిచినా.. ఫోటోలకు ఫోజిచ్చినా.. తన స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇక అంబానీ ఇంట పెళ్లిలో కూడా ఆయన నడకలో.. నడవడికలో ఇదే కనిపించింది.
Rajinikanth Dance
ముఖేష్ అంబానీ చిన కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లికి కోలీవుడ్ నుంచి స్పెషల్ గెస్ట్ గా వెళ్లిన రజినీ కాంత్.. ఆ పెళ్లి వేడుకలో తన డీ గ్లామర్ లుక్స్తో.. స్టైలిష్ మూవ్స్‌తో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ తో కలిసి.. డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌లోనూ తన స్టైల్‌ని మిక్స్ చేసి.. అక్కడున్న వారందర్నీ అరిపించారు. అలా బయటికి వచ్చిన డ్యాన్స్ వీడియోతో.. తలైవా డ్యాన్స్ సూపర్ అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు రజినీ.!
Also Read : The Goat Life OTT : ఓటీటీలోకి రానున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’