Rajinikanth : ‘అమరన్’ టీమ్ కి అభినందనలు తెలిపిన తలైవా

ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్‌....

Rajinikanth : ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన నేషన్ ప్రైడ్ బ్లాక్‌బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని నమోదు చేస్తూ.. సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ‘అమరన్’ చిత్రం‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Rajinikanth Appreciates

ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్‌.. సినిమాని నిర్మించిన తన మిత్రుడు కమల్‌హాసన్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే, హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయి లని ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించుకుని మరీ అభినందించారు. సినిమా కథ, కథనం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వున్నాయని టీమ్‌ అందరినీ ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని, కంట తడి పెట్టించిందంటూ టీమ్‌ని అభినందించారు సూపర్ స్టార్. ప్రస్తుతం ‘అమరన్(Amaran)’ యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది.

2014లో క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌ను ఎదురించి వీర‌మ‌ర‌ణం పొందిన త‌మిళ‌నాడుకు చెందిన ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ బ‌యోగ్ర‌ఫీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ముకుంద్‌గా శివ కార్తికేయ‌న్‌, ముకుంద్ భార్య ఇందు రెబెకా వ‌ర్గీస్‌గా సాయి ప‌ల్ల‌వి న‌టించింది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. భారీ పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో టాప్‌లో దూసుకెళుతోంది.

Also Read : Kiran Abbavaram : ‘క’ సినిమా సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చిన హీరో

AppreciationSuper Star RajinikanthTrendingUpdatesViral
Comments (0)
Add Comment