Rajinikanth:త్వరలో రజనీకాంత్ బయోపిక్ ?

త్వరలో రజనీకాంత్ బయోపిక్ ?

Rajinikanth:కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్… నటనకే కాదు అతని వ్యక్తిత్వానికి కూడా అభిమానులు ఉంటారు. కర్ణాటకలో ఓ బస్సు కండక్టర్ గా పనిచేసి… కోలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు జపాన్, తైవాన్ వంటి దేశాల్లో కూడా ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు రజనీకాంత్. తెరపై రజనీకాంత్ కనిపిస్తే చాలు… అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. అటువంటి రజనీకాంత్ జీవితాన్ని బయోపిక్ రూపంలో తీస్తే… అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. దీనితో బాలీవుడ్‌ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో దర్శకనిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సాజిద్‌ నదియావాలా అలాంటి ప్రయత్నంలోనే ఉన్నారు. రజనీకాంత్‌ బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.

Rajinikanth:

“సాజిద్‌ కేవలం రజనీకాంత్‌ నటనకు మాత్రమే కాదు. ఆయన వ్యక్తిత్వానికి కూడా వీరాభిమానులుంటారు. ఆయన చేసే సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే ఆయన గురించి పూర్తి విషయాలు ఎవరికీ తెలియదు. అందుకే ఆయన జీవితాన్ని తెరపై చూపించాలని సాజిద్‌ నిర్ణయించుకున్నారు” అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌ స్టార్‌ వరకూ ఆయన ఎలా ఎదిగారు, ఎక్కే ఒక్కో మెట్టులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అన్నది సినిమాగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ కథపై చర్చలు చేస్తునట్లు, ఆయన కుటుంబంతో చర్చలు జరుపుతున్నారని’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు కూడా మొదలయ్యాయట.

గతేడాది ‘జైలర్‌’తో భారీ విజయం అందుకున్నా తలైవా ఈ ఏడాది తన కూతురు దర్శకత్వంలో వచ్చిన లాల్‌ సలామ్‌ చిత్రంతో పరాజయాన్ని చవిచూశారు. ప్రస్తుతం ఆయన వేట్టయాన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. టి.జె జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకుడు. తదుపరి లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘తలైవర్‌171’ చిత్రం చేయనున్నారు.

Also Read:-SS Rajamouli: రాజమౌళి-మహేశ్‌ సినిమా ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు !

Sajid NadiadwalaSuper Star Rajanikanth
Comments (0)
Add Comment