Rajinikanth : 33 ఎల్లా తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తలైవా

మణిరత్నం ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు...

Rajinikanth : రజనీకాంత్‌ వయసు 73 ఏళ్లు. అయినా ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులోనూ ఎక్కువగా యాక్షన్ సినిమాల్లోనే నటిస్తున్నారు. రజనీకాంత్‌ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకునే ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇంతలో ఆయన అనారోగ్యం బారిన పడడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే దేశం గర్వించ దగ్గ ఓ దిగ్గజ దర్శకుడి సినిమాలో రజనీకాంత్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనెవరో కాదు ది గ్రేట్ మణిరత్నం. ఇండియన్ సినిమా గతిని మార్చిన దర్శకుల్లో ఒకరైన మణిరత్నం కొత్త సినిమాలో రజనీకాంత్ నటిస్తారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 33 ఏళ్ల క్రితం మణిరత్నం సినిమాలో రజనీకాంత్ నటించారు. ఆ సినిమా పేరు ‘దళపతి’. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, తమిళ సినిమా కల్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత మణిరత్నం(Maniratnam), రజనీకాంత్ మళ్లీ ఒక్కటవుతున్నారు.

Rajinikanth Movies Update

మణిరత్నం ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ కూడా 37 ఏళ్ల తర్వాత మణిరత్నం సినిమాలో నటిస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రికార్డు సృష్టించిన ‘నాయగన్’ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు థగ్ లైఫ్ తో ఒక్కటయ్యారు. రజనీకాంత్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఇటీవల ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉండడంతో డాక్టర్లు స్టెంట్‌ను అమర్చారు. అలాగే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అందుకే సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కాస్త ఆలస్యం అవుతుంది. రజనీకాంత్ తన అప్ కమింగ్ మూవీ ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాత మణిరత్నం సినిమాలో నటించనున్నారని సమాచారం.

Also Read : Priya Bhavani Shankar : శరీరాన్ని వస్తువుగా చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం నచ్చదు

maniratnamMoviesSuper Star RajinikanthTrendingUpdatesViral
Comments (0)
Add Comment