Rajanikanth-Amitab: ప్రపంచ్ కప్ ఫైనల్ పై బిగ్ బి, సూపర్ స్టార్ ఆశక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ్ కప్ ఫైనల్ పై బిగ్ బి, సూపర్ స్టార్ ఆశక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ్ కప్ ఫైనల్ పై బిగ్ బి, సూపర్ స్టార్ ఆశక్తికర వ్యాఖ్యలు

Rajanikanth-Amitab : ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే ప్రపంచ్ కప్ క్రికెట్ ఫైనల్ పై సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబచ్చన్ ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ పై బాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్లు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Rajanikanth-Amitab – భారత్ దే కప్- సూపర్ స్టార్ రజనీకాంత్ జోస్యం

క్రికెట్ కు పెద్ద అభిమాని సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఏ మాత్రం అవకాశం వచ్చినా ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్ కు హాజరయి అటు క్రీడాకారులతో పాటు అభిమానులను హుషారెత్తిస్తారు. ఈ నేఫథ్యంలోనే ముంబై వేదికగా భారత్-న్యూజీలాండ్ ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ కు కుటుంబ సమేతంగా హాజరయి సందడి చేసారు. మ్యాచ్ అనంతరం చెన్నై చేరుకున్న రజనీకాంత్(Rajanikanth) అటు సెమీ ఫైనల్ లో ప్రేక్షకునిగా తన అనుభవంతో పాటు ఆదివారం జరగబోయే ఫైనల్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా తలైవా మాట్లాడుతూ… ‘‘న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. ఒక్కో వికెట్‌ పడేకొద్దీ పరిస్థితి మనకు అనుకూలంగా మారింది. కానీ, మొదటి గంటన్నర మాత్రం చాలా ఆందోళన చెందాం అన్నారు. ఈసారి ప్రపంచకప్‌ వందశాతం భారత్‌కే వస్తుంది అని ఆదివారం జరగబోయే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ పై ధీమా వ్యక్తం చేశారు. అలాగే సెమీఫైనల్స్‌లో రికార్డులు సృష్టించిన కోహ్లీ, షమీలకు రజనీ శుభాకాంక్షలు తెలిపారు.

భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు రానంటున్న బిగ్ బి

భారత్-న్యూజీలాండ్ మధ్య బుధవారం జరిగిన సెమీ ఫైనల్ పై బిగ్ బి అమితాబచ్చన్(Amitabh Bachahan) సోషల్ మీడియా వేదికగా చేసిన ఫన్నీ ఫోస్టు నెట్టింట ఆశక్తికర చర్చకు దారితీస్తుంది. ‘నేను మ్యాచ్ చూడకపోతే. ఇండియా కచ్చితంగా గెలుస్తుంది’ అంటూ భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ పై బిగ్ బి అమితాబచ్చన్ ఫన్నీ పోస్ట్ పెట్టారు. దీనితో ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. ‘ఫైనల్‌ మ్యాచ్‌కు మీరు రావొద్దు’ అని ఒక నెటిజన్‌ కామెంట్ పెట్టారు. భారత్ గెలవాలని కోరుకుంటే ‘మీరు అసలు ఇంట్లో కూడా టీవీ చూడొద్దు’ అని మరో నెటిజన్ కోరారు. ‘ఆరోజు మీరు బయటకు రాకుండా మీ ఇంటి గేట్‌కు తాళాలు వేసేందుకు మేము ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ మరొకరు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనితో ఈ కామెంట్స్ ను చూసిన బిగ్ బి ‘ఇవన్నీ చూశాక.. మ్యాచ్‌కు రావాలా..? వద్దా..? అని ఇప్పుడు నిజంగానే ఆలోచిస్తున్నా’ అంటూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం బిగ్ బి అమితాబ్‌ చేసిన పోస్ట్‌లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Also Read : The Railway Men: ఉత్కంఠ రేపుతున్న ‘‘ది రైల్వే మెన్’’ వెబ్ సిరీస్

Rajanikanth
Comments (0)
Add Comment