Raja Saab Movie : రాజా సాబ్ డైరెక్టర్ మారుతి, ప్రభాస్ ల మేకింగ్ వీడియో చూశారా

ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూపించనున్నట్లు తెలుస్తోంది...

Raja Saab : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తన సినిమా షూటింగ్స్ లో మరింత జోరు పెంచాడు. కొన్ని రోజుల క్రితమే డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్ట్ చేయనున్న ప్రాజెక్ట్ స్టార్ట్ కాగా.. మరికొన్ని రోజుల్లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ కానున్నాయి. అలాగే కొన్నాళ్లుగా ది రాజా సాబ్(Raja Saab) మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.

Raja Saab Movie Updates

ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూపించనున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు (అక్టోబర్ 8నే) డైరెక్టర్ మారుతి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ది రాజా సాబ్ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో డైరెక్టర్ మారుతితో ప్రభాస్ నవ్వుతూ ముచ్చటిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారర్, రొమాంటిక్, కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు మేకర్స్. కొన్నాళ్లుగా యాక్షన్ డ్రామాలతో అలరిస్తున్న ప్రభాస్.. చాలా కాలం తర్వాత హారర్, కామెడీ మూవీతో రాబోతుండడంతో ది రాజాసాబ్ సినిమాపై మంచి హైప్ నెలకొంది.

Also Read : 70th National Awards : నేడు నేషనల్ అవార్డులు అందుకోబోయేది వీరే

CinemaRaja SaabTrendingUpdatesViral
Comments (0)
Add Comment