Raj Tarun: రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘పురుషోత్తముడు’. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 26న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పదన రావడంతో తాజగా ‘పురుషోత్తముడు’ ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ సభ్యులు.
Raj Tarun Movie Updates
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే హీరో బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చి ఓ పల్లెటూళ్ళో ఎవరికి తెలియకుండా ఉన్నట్టు, అతన్ని చంపడానికి శత్రువులు ట్రై చేస్తున్నట్టు ఉంది. ట్రైలర్ చూస్తుంటే పురుషోత్తముడు కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ… ‘‘ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, మంచి పాటలు.. అన్నీ ఉన్న కమర్షియల్ సినిమా ‘పురుషోత్తముడు’. ఇది థియేటర్స్‌లో ఒక పండగ లాంటి వాతావరణాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాం అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించే చిత్రమిది. తప్పకుండా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు నిర్మాతలు రమేశ్, ప్రకాశ్. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా… పీజీ విందా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read : Adivi Sesh: మరోసారి గొప్పమనసు చాటుకున్న అడవి శేష్ !