Raj Tarun – Lavanya Case: హీరో రాజ్‌తరుణ్‌కు హైకోర్టులో భారీ ఊరట !

హీరో రాజ్‌తరుణ్‌కు హైకోర్టులో భారీ ఊరట !

Raj Tarun: హీరో రాజ్ తరుణ్‌ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనపై మాజీ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు​ బెయిల్‌ ను మంజూరు చూసింది. లావణ్యతో పెళ్లి జరిగినట్లుగా ఆధారాలు లేనందున రాజ్ తరుణ్‌ కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ను మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

ఈ సందర్భంగా రాజ్ తరుణ్ తరపు న్యాయవాది స్పందిస్తూ… రాజ్ తరుణ్‌(Raj Tarun)కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 30కి పైగా సినిమాలలో రాజ్ తరుణ్ నటించారు. ఆయనపై ఎటువంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారు. కేసు అయితే పెట్టారు కానీ… కోర్టు అడిగిన ఆధారాలు వారు చూపించలేదు. లావణ్యతో పెళ్లి జరిగినట్లుగా ఆధారాలు లేనందున రాజ్ తరుణ్‌కు రూ. 20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని చెబుతూ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు.

Raj Tarun – అసలు ఏం జరిగిదంటే ?

‘‘పదకొండేళ్లగా రాజ్‌ తరుణ్‌ నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతనిప్పుడు నన్ను వదిలేసి మాల్వీ మల్హోత్రా తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు.. నా రాజ్‌ నాకు కావాలి’’ అంటూ లావణ్య ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌ తనను ప్రేమించాడనీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఇటీవల ఆమె నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీనిపై రాజ్‌ తరుణ్‌ కూడా స్పందించాడు.

రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నాననీ, కొంతకాలంగా టార్చర్‌ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్‌ తరుణ్‌(Raj Tarun). ఇలా మొదలైన ఈ ఇష్యూ ట్విస్ట్‌లతో ఓ టీవీ సీరియల్‌ లా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌తరుణ్‌ పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రాజ్‌ తరుణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనితో న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

నాపై లావణ్య చేసినవని ఆరోపణలు మాత్రమే, ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని రీసెంట్‌ గా జరిగిన ‘తిరగబడరసామీ’ మూవీ ప్రమోషన్స్‌లో రాజ్ తరుణ్ చెప్పిన విషయం తెలిసిందే. మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టే మహిళలున్నారు… నాపై కూడా తప్పుడు కేసులు పెట్టారు అని రాజ్ తరుణ్ చెప్పినట్లుగానే… ఆయనపై లావణ్య పెట్టిన నార్సింగి కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు​ బెయిల్‌ ను మంజూరు చూసింది.

Also Read : Nandamuri Balakrishna: బాలకృష‍్ణ 50 ఏళ్ళ నటజీవితం పోస్టర్ ఆవిష్కరణ !

LavanyaMalvi MalhotraRaj Tarun
Comments (0)
Add Comment