Rahul Ramakrishna : సంధ్య థియేటర్ ఘటనపై తను వేసిన కౌంటర్ ను వెనక్కి తీసుకున్న నటుడు

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం...

Rahul Ramakrishna : ‘పుష్ప 2’రిలీజ్‌, సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రెండు వారాలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు ఎంతోమంది సెలబ్రిటీలు బన్నీకి మద్దతు ఇస్తూ పోస్ట్‌లు పెట్టారు. కొందరు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే సమయంలో పోలీసుల తీరును ప్రశ్నిస్తూ కమెడీయన్‌ రాహుల్‌ రామకృష్ణ(Rahul Ramakrishna) పోస్ట్‌ పెట్టారు.

తాజాగా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మరో పోస్ట్‌ చేశారు. సంధ్య థియేటర్‌ వద్ద ఏం జరిగిందో తెలుపుతూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వీడియో విడుదల చేశారు. తదుపరి ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌తో రాహుల్‌ రామకృష్ణ(Rahul Ramakrishna) పోస్ట్‌ పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ‘ఆరోజు జరిగిన ఘటనపై అప్పుడు నాకు సరిగ్గా సమాచారం లేదు. ఆరోజు చేసిన వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నా’ అని రాహుల్‌ అన్నారు. దీనికి ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘మీ తీరు చాలా బాగుంది అన్నా.. నిజం వైపు నిలబడడం అన్నిటికన్నా ముఖ్యం. ఇలాంటి విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని అన్నారు.

Rahul Ramakrishna Comment

‘సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. కానీ, లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యం.. ఒక్క వ్యక్తి చేసిన తప్పు ఎలా అవుతుంది?. పబ్లిక్‌ ప్రదేశాలకు సెలబ్రిటీలు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్థాయిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మంది ప్రజలు వస్తారని తెలిసినప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు. అంతమందిని లోపలికి ఒకేసారి ఎందుకు అనుమతించారు? మతపరమైన ఊరేగింపులు, రాజకీయ పారీట్ల మీటింగ్‌ల సమయాల్లో జరిగే తొక్కిసలాటల్లోనూ కొన్నిసార్లు ప్రజలు మరణిస్తారు. అలాంటివాటికి ఇంతవేగంగా ఎందుకు స్పందించరు? సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చూడాలి. కానీ ఏం చేసిన ప్రాణాలు తీసుకురాలేం. ఆ స్థానాన్ని భర్తీ చేయలేం. ఇలాంటి ఘటనల్లో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.

Also Read : Rajinikanth : తలైవా ‘జైలర్ 2’ సినిమా పై మరో కీలక అప్డేట్

Pushpa 2Rahul RamakrishnaSandhya TheatreUpdatesViral
Comments (0)
Add Comment