Raghubabu: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన సీనియర్ నటుడు రఘుబాబు(Raghubabu)కు బెయిల్ మంజూరు అయింది. రఘుబాబు నడుపుతున్న కారు ఓ ద్విచక్ర వాహన దారుడిని ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుడు బీఆర్‌ఎస్ నాయకుడు నల్లగొండలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (55). బీఆర్‌ఎస్ నలగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్దన్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారి.
Raghubabu Got Bail
బీఆర్‌ఎస్ నాయకుడు సందినేని జనార్దన్ రావు బుధవారం సాయంత్రం బైక్ పై వెంచర్ కు వెళుతూ నల్లగొండ శివారులోని లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న రఘుబాబు బీఎండబ్ల్యూ కారు… జనార్థన్ బైక్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో జనార్దన్ గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడి… పక్కన డివైడర్‌పై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. దీనితో జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రఘుబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
Also Read : Varun Sandesh: ఇంట్రెస్టింగ్ గా వరుణ్ సందేశ్ ‘నింద’ పోస్టర్ !