Raghava Lawrence : నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ 25 వ సినిమా టైటిల్ ఇదే..

ఫ‌స్ట్ లుక్‌ను గ‌మనిస్తే ఇంట్రెస్టింగ్ అంశాల‌ను గ‌మ‌నించ‌వ్చు...

Raghava Lawrence : రాఘ‌వ లారెన్స్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కాల భైరవ’. రాక్ష‌సుడు, ఖిలాడి వంటి చిత్రాల‌ను రూపొందించ‌న కోనేరు సత్యనారాయణ ఇప్పుడు ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై మ‌రో ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడ‌క్ష‌న్స్‌, హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్‌(Raghava Lawrence) కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రూపొందుతుండ‌టం విశేషం. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రాక్ష‌సుడు, సెన్సేష‌న‌ల్ మూవీ ఖిలాడి వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ఈ చిత్రం నిర్మాణాత్మ‌క ద‌శ‌లో ఉంది. మంగళవారం లారెన్స్ రాఘవ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాఘ‌వ లారెన్స్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోంది. RL25 చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మనిస్తే ఇంట్రెస్టింగ్ అంశాల‌ను గ‌మ‌నించ‌వ్చు. ‘ ది వ‌ర‌ల్డ్ విత్ ఇన్‌’, ‘ఏ ప్యాన్ ఇండియా సూప‌ర్ హీరో ఫిల్మ్’ వంటి లైన్స్ అంచ‌నాల‌ను ఆకాశానికెత్తేస్తున్నాయి. రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని కోనేరే స‌త్య‌నారాయ‌ణ‌, మనీష్ షా అత్యంత భారీగా రూపొందిస్తున్నారు.

Raghava Lawrence Movies

ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత గొప్ప సినిమాను చూడ‌లేద‌నేంత గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కు అందించ‌టానికి మేక‌ర్స్ ప్ర‌తీ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ‘ కాల భైరవ’ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్నివివ‌రాల‌ను మేక‌ర్స్ తెలియ‌జేస్తారు.

Also Read : Thandel Movie : సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ‘తండేల్’ సినిమా

Moviesraghava lawrenceTrendingUpdatesViral
Comments (0)
Add Comment