Raghava Lawrence : ఓం రాఘ‌వేంద్రాయ న‌మః – లారెన్స్

స్వామిని ద‌ర్శించుకున్న న‌టుడు, ద‌ర్శ‌కుడు

Raghava Lawrence : ప్ర‌ముఖ త‌మిళ సినీ న‌టుడు, ద‌ర్శ‌కుడు , కొరియో గ్రాఫ‌ర్ రాఘ‌వ లారెన్స్ శ్రీ రాఘవేంద్ర స్వామి భ‌క్తుడు. ఆయ‌న‌కు ఎన‌లేని గౌర‌వం. ఎప్పుడు వీలు కుదిరినా వెంట‌నే శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాల‌యం పుణ ప్ర‌దేశానికి వెళ‌తారు.

Raghava Lawrence Lord Raghavendra Devotee

తాను తీవ్ర అనారోగ్యానికి లోనైన‌ప్పుడు లారెన్స్ అనుకోకుండా మంత్రాల‌యానికి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో శ్రీ రాఘ‌వేంద్ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత బ‌త‌క‌డు అనుకున్న లారెన్స్(Raghava Lawrence) ఏకంగా తిరిగి జ‌న్మ పొందారు. తాను ఆరోగ్యంగా ఉండడానికి ఆ రాఘ‌వేంద్రుడే కార‌ణ‌మ‌ని న‌మ్మాడు, విశ్వ‌సించాడు రాఘ‌వ లారెన్స్.

స్వామి వారి పేరుతోనే దాన ధ‌ర్మాలు చేయ‌డం మొద‌లు పెట్టాడు. అంతే కాదు పెద్ద ఎత్తున సామాజిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు న‌టుడు, ద‌ర్శ‌కుడు. ఇదే స‌మ‌యంలో త‌మిళ దిగ్గ‌జ న‌టుడైన సూప‌ర్ స్టార్, త‌లైవా ర‌జ‌నీకాంత్ సైతం శ్రీ రాఘవేంద్ర స్వామి భ‌క్తుడు. ఆయ‌న ప్ర‌తి ఏటా స్వామి వారిని ద‌ర్శించుకుంటారు.

ఇదిలా ఉండ‌గా ఆగ‌స్టు 31న గురువారం శ్రీ రాఘ‌వేంద్ర స్వామి వారి 365వ ఆరాధ‌న దినోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. ఇవాళ మంత్రాల‌యంలో , తాను అంబ‌త్తూరులో నిర్మించిన రాఘ‌వేంద్ర స్వామి గుడిలో పూజ‌లు చేశారు రాఘ‌వ లారెన్స్. విచిత్రం ఏమిటంటే లారెన్స్ ఏకంగా రాఘ‌వేంద్రుడికి గుర్తుగా రాఘ‌వ లారెన్స్ అని పేరు మార్చుకున్నాడు.

Also Read : Pawan Kalyan OG Teaser : ప‌వర్ స్టార్ ఓజీ టీజ‌ర్ అప్ డేట్

Comments (0)
Add Comment