Raghava Lawrence: దివంగత సీనియర్ నటుడు విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండ్యన్ హీరోగా ‘పడైతలైవన్’ పేరుతో అన్బు దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతుంది. ఇందులో దర్శక నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్(Raghava Lawrence) అతిథి పాత్ర పోషించనున్నట్టు మొదట ప్రకటించారు. కానీ ఇప్పుడీ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర దర్శకుడు ఆన్బు వివరణ ఇచ్చారు. ‘షణ్ముగ పాండ్యన్ సినీ కెరీర్‌కు సాయ పడేందుకు ఆయన కొత్త చిత్రంలో నటించేందుకు లారెన్స్ ముందుకు వచ్చారు. దీంతో నేను, షణ్ముగ పాండ్యన్ స్వయంగా లారెన్స్ ను కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పాం. ఆ తర్వాత సినిమాలో ఆయన పాత్ర డిజైన్ చేశాం. కానీ, ఆయన పాత్ర ఈ సినిమాకు బలంగా ఉంటుందా ? అనే సందేహం కలిగింది. వెంటనే లారెన్స్‌ను కలిసి వివరించగా, ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.
Raghava Lawrence…
అదే సమయంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. అంతేకానీ, రాఘవ లారెన్స్ ఈ ప్రాజెక్టు నుంచి అర్థాంతరంగా తప్పుకోలేదు’ అని దర్శకుడు అన్బు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే రాఘవ లారెన్స్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో… విజయ్ కాంత్ అభిమానుల నుండి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. విజయ్ కాంత్ బ్రతికి ఉండగా పాత్రకు ఒప్పుకున్న లారెన్స్… ఆయన చనిపోవడంతోనే సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరగడంతో నెటిజన్లు లారెన్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి తెర పడే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Kiran Abbavaram: కూర్గ్ లో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి !