Raghava Lawrence : ప్రఖ్యాత కొరియోగ్రాఫర్, దర్శకుడు మరియు నటుడు రాఘవ లారెన్స్ గురించి సినీ వర్గాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో అభిమానులను అలరించే ఈ హీరో ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లల బాగోగులు చూస్తున్న రియల్ హీరో. గుండె జబ్బులతో బాధపడుతున్న చాలా మంది చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు.
Raghava Lawrence..
ఇటీవల పేదలకు ట్రాక్టర్లు, బైక్‌లు, కార్లు, ఆటోలు, కుట్టుమిషన్లు ఇచ్చి తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అయితే లారెన్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దానికి తోడు లారెన్స్ తాజాగా తన కొడుకు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సినిమా తారలు తమ పిల్లలను సినిమా రంగానికి పరిచయం చేయడం ఎప్పుడు మామూలే? మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే లారెన్స్ అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు.
Also Read : Kangana Ranaut : కంగనా పై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కి మరో షాక్