Radhika Apte : కెరీర్ పీక్స్ లో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

తాజాగా ఆమె చిట్టితల్లితో కలిసి ఇలా వర్క్ చేసుకోవాల్సి వస్తోందంటూ బిడ్డకు పాలిస్తూ పెట్టిన పోజు వైరల్ గా మారింది.

Radhika Apte : బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాధికా ఆప్టే అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆమె పండంటి బిడ్డకు జన్మించిందని తెలిపింది. తాజాగా ఈ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. ఫోటోలు వైరల్ అయ్యాయి. విజయ్ వర్మ, మనీష్ మల్హోత్ర, పాయల్ రాజ్ పుత్, దివ్యేందు, జోయా అక్తర్, రాజీవ్ మసాంద్ వంటి సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగా 2012లో ఆమె బ్రిటీష్‌ వయొలనిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి అయ్యింది.

Radhika Apte…

తాజాగా ఆమె చిట్టితల్లితో కలిసి ఇలా వర్క్ చేసుకోవాల్సి వస్తోందంటూ బిడ్డకు పాలిస్తూ పెట్టిన పోజు వైరల్ గా మారింది. బిడ్డకు జన్మనిచ్చిన వారం తర్వాత రాధికా(Radhika Apte) ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడం విశేషం. తెలుగులో లెజెండ్, లయన్ అంటూ బాలయ్యతో కలిసి సందడి చేసింది. రక్తచరిత్ర 1, రక్త చరిత్ర 2 చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ప్రకాష్ రాజ్ ధోని చిత్రంలో నటిగా మెప్పించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌తో కుర్రకారుని కట్టి పడేసింది. ఇక ఈమె నటించిన అంధాదున్ చిత్రం బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సిస్టర్ మిడ్ నైట్ కాకుండా.. విజయ్ సేతుపతి కత్రినా కలిసి నటించిన మెరీ క్రిస్మస్ చిత్రంలో రాధిక చివరగా కనిపించింది.

మరోవైపుప్రపంచంలోని సినీ పరిశ్రమలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రాధికా ఆప్టే(Radhika Apte) సినిమా స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ సినిమా ‘డైరెక్టర్స్‌ పార్టునైట్‌’కేటగిరీలో స్క్రీనింగ్ కానుంది. దీనికి కరణ్‌ కాంధారి దర్శకుడు. భారత్‌ నుంచి ఈ విభాగానికి సెలెక్ట్‌ అయిన ఒకే ఒక చిత్రమిది. కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి అనుకోని సమస్యల్లో ఇరుక్కొని.. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఏం చేసిందో ఇందులో చూపించారు. హాస్యం, ప్రేమలకు సైతం ఇందులో చోటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వెల్లింగ్టన్‌ ఫిల్మ్స్‌, రాధికా ఆప్టే, సూటబుల్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించారు. అలాగే మరోవైపు సిక్కిం దర్శకుడు సామ్తెన్‌ భుటియా దర్శకత్వం వహించిన ‘తార: ది లాస్ట్‌ స్టార్‌’ ప్రదర్శనకు బరిలో ఉంది. సావిత్రీ ఛెత్రీ నిర్మించారు. హిమాలయ పర్వత సానువులు, సిక్కిం రాష్ట్రంలో ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సోషల్‌ డ్రామాని తెరకెక్కించాం. ఆ ప్రాంత వాసులే ప్రధాన పాత్రలు పోషించారు’’ అని దర్శకుడు అన్నారు.

Also Read : Sandhya Theater Tragedy : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు గురైన బాలుడి ఆరోగ్యంపై కీలక అప్డేట్

Radhika ApteTrendingUpdatesViral
Comments (0)
Add Comment