Radhika Apte: మరాఠీ బ్యూటీ రాధికా ఆప్టేకు ఎయిర్ పోర్టు అధికారులు చుక్కలు చూపించారు. ఫ్లైట్ బయలు దేరడానికి రెండు గంటలు ముందే… ప్రయాణికులను ఏరో బ్రిడ్జ్ ఎక్కించి తాళాలు వేసి… ఎయిర్ పోర్టు అధికారులకు తమకు నరకం చూపించారని తన ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చింది. ప్రయాణికుల్లో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని అందరినీ గంటకు పైగా ఏరో బ్రిడ్జ్‌లోనే ఉంచారని ఆమె తెలిపారు. ఎరో బ్రిడ్జ్ లో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డాము. సెక్యూరిటీ ఏరో బ్రిడ్జ్ డోర్ కూడా తెరవలేదు. అసలు అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా ఏం జరుగుతుందో తెలియడం లేదు. తాగడానికి మంచి నీరు లేదు, వాష్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా వీల్లేదు. ఇదో వింత అనుభవం అని తన ఇన్ స్టా పోస్టులో పేర్కొంది రాధికా ఆప్టే(Radhika Apte). అయితే ఆ ఎయిర్ పోర్టు పేరుగాని, ఫ్లైట్ వివరాలు గాని వెల్లడించలేదు. దీనితో రాధిక పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Radhika Apte Comment
అయితే నటి రాధిక ఆప్టే పోస్టుపై ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతినిధులు స్పందించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎయిర్ పోర్టు నుండి భువనేశ్వర్ వెళ్ళాల్సిన 6E2301 ఫ్లైట్ రెండు గంటలు ఆలస్యం అయిందని… ఈ సమాచారాన్ని ప్రయాణీకులకు తెలియజేసామని… అంతేకాదు ప్రయాణీకులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని… ఇండియో ఎయిర్ లైన్స్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనితో రాధికా ఆప్టే తన ఇన్ స్టాలో రాసించి ముంబై ఎయిర్ పోర్టు గురించి అని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ రాధికా ఆప్టే. తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే… ఇటీవల విజయ్‌సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.
Also Read : Hero Yash : యష్ ఫ్యాన్స్ దుర్మరణం.. వారి కుటుంబాలకు హీరో నష్టపరిహారం