Raayan: నెట్టింట వైరల్ అవుతోన్న ధనుష్‌‘రాయన్‌’ సక్సెస్‌ పార్టీ ఫొటోలు !

నెట్టింట వైరల్ అవుతోన్న ధనుష్‌‘రాయన్‌’ సక్సెస్‌ పార్టీ ఫొటోలు !

Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాయన్‌’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ దీనిని నిర్మించారు. ధనుష్‌ నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, ప్రకాశ్‌రాజ్‌, సందీప్‌ కిషన్‌, అపర్ణా బాలమురళీ, సెల్వరాఘవన్‌ కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఇది తెరకెక్కినట్లు సమాచారం. ‘కెప్టెన్‌ మిల్లర్‌’ తర్వాత సందీప్‌ కిషన్‌ మరోసారి ధనుష్‌ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం.

Raayan Movie Updates

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చి… మంచి టాక్‌ సొంతం చేసుకుంది. కథ, కథనం, కీలక నటీనటుల యాక్టింగ్‌, ఇలా అన్నీ చక్కగా కుదిరాయని సినీ ప్రియులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమ సినిమా సక్సెస్‌ను చిత్రబృందం సెలబ్రేట్‌ చేసుకుంది. ‘రాయన్‌(Raayan)’ టీమ్‌ అందరూ ఒకేచోట కలిశారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌పై ఆనందం వ్యక్తంచేశారు.

ఈ సక్సెస్ పార్టీకు సంబంధించిన ఓ ఫొటోని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తన సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘టీమ్‌ రాయన్‌.. మన వర్క్‌కు గుర్తింపు లభించినప్పుడు వచ్చే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు ఈ విజయాన్ని అందించినందుకు థ్యాంక్యూ ధనుష్‌. మీరు మమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

Also Read : Andhagan: ‘అంధగన్‌’ రీమేక్‌ కాదు… రీమేడ్‌ అంటోన్న దర్శక నిర్మాత త్యాగరాజన్‌ !

danushPrakash RajRaayan
Comments (0)
Add Comment