Raayan: 8 రోజుల్లో వంద కోట్ల క్లబ్‌ లో చేరిన ధనుష్ ‘రాయన్‌’ !

8 రోజుల్లో వంద కోట్ల క్లబ్‌ లో చేరిన ధనుష్ ‘రాయన్‌’ !

Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రాయన్‌(Raayan)’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ దీనిని నిర్మించారు. ధనుష్‌ నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, ప్రకాశ్‌రాజ్‌, సందీప్‌ కిషన్‌, అపర్ణా బాలమురళీ, సెల్వరాఘవన్‌ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించి… బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా విడుదలైన అతితక్కువ రోజులకే ఆస్కార్‌ లైబ్రరీలో చోటు దక్కించుకుంది.

Raayan Movie Updates

భారీ అంచనాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అదే స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లను వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో వరల్డ్‌ వైడ్‌ గా వందకోట్ల బెంచ్‌ మార్క్‌ను దాటిన తమిళ చిత్రాల్లో ‘ఇండియన్ 2’ రూ.145.53 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. రూ. 105.69 కోట్ల కలెక్షన్లతో ‘మహారాజ’ రెండో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం రాయన్‌ మూడోస్థానంలో ఉన్నప్పటికీ ఇదే హవా కొనసాగితే మాత్రం ఈ రెండు సినిమాల కలెక్షన్లను బీట్‌ చేసే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. రాయన్‌ ఒక్క ఇండియాలోనే సుమారు రూ.72.75 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ధనుష్‌ నటించిన ‘తిరు’ ప్రపంచవ్యాప్తంగా రూ.117 కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తే, ‘సార్‌’ రూ.116 కోట్లు వసూలు చేసింది. ఇదే స్పీడు రెండో వారంలోనూ కొనసాగితే అతి తక్కువ కాలంలోనే రాయన్‌ కూడా ఆ జాబితాలో చేరుతుందని చిత్రబృందం అంచనా వేస్తోంది.

Also Read : Hello Baby: సింగిల్‌ క్యారెక్టర్‌ తో వస్తోన్న ‘హలో బేబీ’ !

danushRaayanSun Pictures
Comments (0)
Add Comment