Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాయన్(Raayan)’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ దీనిని నిర్మించారు. ధనుష్ నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్, అపర్ణా బాలమురళీ, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించి… ప్రేక్షకాదరణతో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన అతితక్కువ రోజులకే ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకుంది.
Raayan Movie Updates
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో ‘రాయన్’ స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఈ విషయంపై ఆనందం వ్యక్తంచేస్తూ నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. దీంతో సినీ ప్రముఖులు ధనుష్ కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. గొప్ప స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లేలకు మాత్రమే ఆస్కార్ అకాడమీ లెబ్రరీలో చోటు కల్పిస్తారు. గతేడాది వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ స్క్రిప్ట్‌కు కూడా ఆస్కార్ లైబ్రరీలో శాశ్వత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అలాగే తమిళ చిత్రం ‘పార్కింగ్’కి కూడా ఈ గౌరవం లభించింది.
‘రాయన్’ విషయానికొస్తే.. ధనుష్ నటించిన 50వ చిత్రమిది. ఆయన స్వీయ దర్శకత్వంలో యాక్షన్ క్రైమ్ ఫిల్మ్‌గా రూపొందింది. ఆయన నటనను, దర్శకత్వాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఇప్పుడు దీని స్క్రీన్‌ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా ‘రాయన్’ రికార్డు నెలకొల్పింది.
Also Read : Bigg Boss Telugu Season 8: ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ – 8’ టీజర్ అదుర్స్ !