Raashii Khanna : నవంబర్ 30న తన వయస్సును ఒక సంవత్సరం పెంచుకున్న రాశి ఖన్నా

Raashii Khanna : తనకు విపరీతమైన దైవభక్తి అని ప్రముఖ హీరోయిన్‌ రాశీఖన్నా అన్నారు. తెలుగులో ‘బెంగాల్ టైగర్’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’, ‘సుప్రీమ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాలలోనూ.. కోలీవుడ్ ‘ఇమైకా నొడిగల్‌, ’సర్దార్‌’, ‘అరణ్మనై-4’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన రాశీఖన్నా(Raashii Khanna).. ప్రస్తుతం హిందీ భాషా చిత్రాల్లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో ‘సబర్మతి రిపోర్ట్‌’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ గ్లామర్ ఫొటోలతో సందడి చేస్తుంటుందీ బబ్లీ బ్యూటీ.

Raashii Khanna Birthday Updates

నవంబరు 30న తన వయసుని మరో సంవత్సరం పెంచుకున్న ఈ భామ మాట్లాడుతూ.. ‘నేను నటించిన అన్ని భాషలలోని చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా ‘సబర్మతి రిపోర్ట్‌’ మూవీలో నా నటనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిల నుండి ప్రశంసలు రావడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఇది నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నా పుట్టిన రోజు సందర్భంగా గత నాలుగేళ్ళుగా మొక్కలను నాటుతున్నాను. ఈ పుట్టిన రోజు కూడా వారణాసిలో మొక్కలు నాటాను. నాలో లోతైన భక్తి భావాలున్నాయి. దేవుడిని ప్రార్థించడం ఎంతో ఇష్టం. గత పదేళ్ళుగా దైవభక్తిలో మునిగిపోయానని చెప్పుకొచ్చిందీ చిన్నది.

ప్రస్తుతం రాశీఖన్నాకు టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రావడం లేదు. ఒకటి, రెండు సినిమాలు తప్పితే ఆమెకు అవకాశాలు అంతగా లేవనే చెప్పుకోవాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసిన ‘జై లవ కుశ’ సినిమా తర్వాత ఆమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తాయని అంతా భావించారు. ఆమె కూడా అదే అనుకుంది. కానీ అది జరగలేదు. తన అందంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లాల్సిన రాశీఖన్నా.. ప్రస్తుతం అవకాశాల కోసం వేచి చూస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో మాత్రం ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.

Also Read : Suriya44 Movie : కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో హీరో సూర్య 44వ సినిమా

BirthdayRaashii KhannaTrendingUpdatesViral
Comments (0)
Add Comment