R Narayana Murthy : సంధ్య థియేటర్ బాధితుడు ‘శ్రీతేజ్’ ను పరామర్శించిన నటుడు

వీరితో పాటు అల్లు అరవింద్, బన్నీ వాసులు కూడా కలిసి అండగా ఉంటాం అని భరోసానిచ్చారు...

R Narayana Murthy : సంధ్య ధియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్‌ని సోమవారం ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి(R Narayana Murthy) పరామర్శించారు. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (9) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రికి క్యూ కట్టారు. తాజాగా ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. బాలుడి ఆరోగ్యస్థితిపై అరా తీశారు. రేవతి భర్త భాస్కర్ కి ధైర్యం చెప్పారు. ఇప్పటికే ‘పుష్ప 2’ టీమ్ నుండి సుకుమార్, జగపతి బాబు, మైత్రీ నిర్మాతలు కలిశారు. వీరితో పాటు అల్లు అరవింద్, బన్నీ వాసులు కూడా కలిసి అండగా ఉంటాం అని భరోసానిచ్చారు.

R Narayana Murthy Meet..

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి చెందిన సెలబ్రిటీలపై మండిపడిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. “బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ఎవరూ ఆసక్తి చూపించలేదు. కానీ అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధితులను పరామర్శించడానికి ముందుకు రాలేదు. దీనిని బట్టి చూస్తుంటే అసలు సినీ ప్రముఖులు ఏం కోరుకుంటున్నారనేది నాకు అర్థం కావడం లేదు. అసలు అల్లు అర్జున్‌కు ఏమైంది.. అంతగా ఇంటికి క్యూ కట్టి నన్ను తిడుతున్నారు. అల్లు అర్జున్‌కు ఏమైనా కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా? ఎందుకు అంతగా పరామర్శిస్తున్నారు. సినిమా వాళ్లపై నాకు కోపం ఎందుకు ఉంటుంది? సినిమా వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని చేసిన వ్యాఖ్యలకు చిత్ర పరిశ్రమ కదులుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : Naga Vamsi : టాలీవుడ్ అగ్ర నేతలు సీఎంను కలిసే ప్రయత్నంలో ఉన్నారు

MeetR Narayana MurthySandhya Theatre
Comments (0)
Add Comment