R. Madhavan: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా సినిమా ‘సైతాన్’. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 08న విడుదలైన పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. గుజరాతీ హారర్ థ్రిల్లర్ ‘వష్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు. వశీకరణకు గురైన తన కూతురిని కాపాడడానికి తల్లిదండ్రులుగా అజయ్, జ్యోతిక చేసిన సాహసాలు…. ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. దీనితో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లు వసూళ్ళు చేసి రికార్డు సృష్టించింది. అయితే ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాధవన్(R. Madhavan) మాట్లాడుతూ… అజయ్ దేవగణ్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అజయ్ దేవగణ్ కు ప్రశంసల జల్లు కురిపించారు.
R. Madhavan Praises
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ… ‘నా జీవితంలో అజయ్‌దేవగణ్ లాంటి కోస్టార్‌ను చూడలేదు. అలాంటి వ్యక్తితో కలిసి ఇప్పటివరకు పని చేయలేదు. ఆయన పనిని ప్రేమిస్తారు. ‘షైతాన్’లో ఆయనతో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగానూ వ్యవహరించారు. అయినా సెట్‌లో చాలా సరదాగా ఉండేవారు. చిత్రీకరణ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. ‘షైతాన్’ టైటిల్ కూడా ఆయన ఎంపిక చేసినదే. ఇందులో పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. స్క్రీన్ పై నేను బాగా కనిపించాలని నాకంటే ఎక్కువ అజయ్ తాపత్రయపడ్డాడు. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నాడు. అతడి కేరింగ్ చూసి నా భార్య కూడా ఆశ్చర్యపోయింది. ‘మీ నాన్న కూడా మిమ్మల్ని ఇంత జాగ్రత్తగా చూసుకోలేదు’ అని నాతో చెప్పింది’ అంటూ అజయ్ పై మాధవన్ ప్రశంసలు కురిపించారు.
Also Read : Monkey Man OTT : సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘మంకీ మ్యాన్’