R Madhavan : ఆర్ మాధవన్ , నయనతార , సిద్దార్థ్ కలిసి నటించిన చిత్రం టెస్ట్(Test). ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్దమవుతోంది. విచిత్రం ఏమిటంటే ఇది తొలి తమిళ ఒరిజినల్ ఫీచర్ ఫిలిం. ఓటీటీ సంస్థ అధికారికంగా కీలక ప్రకటన చేసింది. టెస్ట్ మూవీ వచ్చే ఏప్రిల్ నెల 4వ తేదీన ప్రేక్షకులను అలరించనుందని పేర్కొంది.
R Madhavan – Nayanthara Test Movie OTT Updates
ఇది ముగ్గురు వ్యక్తుల జీవితాలను కలిపి అల్లిన శక్తివంతమైన డ్రామా గా తెరకెక్కింది. ఇందులో మీరా జాస్మిన్ కూడా కీలక పాత్ర పోషించింది. చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది క్రికెట్ రంగానికి విస్తరించి ఉన్న నైతిక సందిగ్ధతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటను మించిన పందాలతో, ఒక క్షణం, ఒక నిర్ణయం, ప్రతిదీ మార్చే శక్తిని కలిగి ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం పరిశీలిస్తుంది. టెస్ట్ మూవీకి ఎస్. శశి కాంత్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు డైరెక్టర్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కథను తయారు చేసుకున్నా. టెస్ట్ కోసం చాలా కష్ట పడ్డా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ తాను థ్యాంక్స్ తెలియ చేసుకుంటున్నానని అన్నాడు. ప్రధానంగా నయన్, మాధవన్, సిద్దార్థ్, జాస్మిన్ ఎవరికి వారే అద్భుతమైన నటులంటూ కితాబు ఇచ్చాడు. వీరితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నాడు.
Also Read : Beauty Sonakshi Sinha- Jatadhara :సోనాక్షి సిన్హా జటాధర ఫస్ట్ లుక్ రిలీజ్