R Madhavan: ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉండే విలాసవంతమైన ఫ్లాట్ ను సొంతం చేసుకున్నారు. ఈ లగ్జరీ ఫ్లాట్ విలువ దాదాపు రూ.17.5 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జూలై 22న ఖరారు ఈ ఆస్తిని తనపేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మాధవన్ కొన్న ఫ్లాట్ లో అత్యాధునిక సౌకర్యాలు, ఇండోర్ ప్లే ఏరియా లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
R Madhavan….
కాగా ఆర్ మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ప్రస్తుతం శశికాంత్ డైరెక్షన్‌లో టెస్ట్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నయనతార, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు గోపాలస్వామి దొరైస్వామినాయుడు బయోపిక్‌లో కనిపించనున్నారు. అంతే కాకుండా శంకరన్ నాయర్ బయోపిక్ లో అతిథి పాత్ర, సైన్స్-ఫిక్షన్ చిత్రం జీలో కీ రోల్ పోషిస్తున్నారు.
Also Read : Bellamkonda Sai Sreenivas: అంధులకు యువ హీరో బెల్లకొండ శ్రీనివాస్ ప్రత్యేక సాయం !