Puspha-Salar: రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప-2, సలార్

రామోజీ ఫిల్మ్‌సిటీలో అల్లు అర్జున్, ప్రభాస్ ల ఆటా పాటా

రామోజీ ఫిల్మ్‌సిటీలో అల్లు అర్జున్, ప్రభాస్ ల ఆటా పాటా

Puspha-Salar : భాషతో సంబందం లేకుండా భారతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న మొస్ట్ ఎవెయింటింగ్ ప్రాజెక్టులుగా పుష్ప-2, సలార్ ఉన్నాయి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీసు ముందు రికార్డులు సృష్టించడమేకాకుండా, అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. దీనితో పుష్ప-2(Puspha-2)పై భారీ అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్… బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

డిసెంబరు 22న విడుదలకు సిద్ధమౌతున్న ఈ సలార్ సినిమాకు సంబందించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబందించి కీలక పాటలు మరియు ఫైట్స్ చిత్రీకరణకు సంబందించి రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా మారడంతో అల్లు అర్జున్, ప్రభాస్ ల ఆటా పాటకు ఆర్ ఎఫ్ సి వేదికగా మారింది. సుమారు నెల రోజుల పాటు జరగబోయే ఈ షూటింగ్ లో వందలాది మంది డ్యాన్సర్లు, స్టంట్ మెన్ లు పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది.

 

Puspha-Salar – గణేశ్ ఆచార్య కోరియోగ్రఫీలో పుష్ప-2 పాట

ఉ అంటావా మావ… ఊఊ అంటావా… పాటలో పుష్ప సినిమాలో తనదైన స్టెప్పులతో యువతను ఉర్రూతలకెక్కించిన గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా పుష్ప-2లో మరో పాట తెరకెక్కిస్తున్నారు. దీని కోసం వందలాది మంది డ్యాన్సర్లతో జాతర నేపథ్యంలో సాగే పాటను తెరకెక్కించడానికి రామోజీ పిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ ను రూపొందించారు. ‘పుష్ప’కి దీటుగా ‘పుష్ప2’ ఉండేలా పాటతో పాటు ఫైట్ సీన్ ను కూడా ఇక్కడే చిత్రీకరించడానికి పుష్ప పాటన్నా… ఫైట్‌ అన్నా తగ్గేదేలే అన్నట్టుగా భారీ సెట్ వేసి చిత్రీకరణ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన పుష్ప భారీ విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా పుష్ప-2 ను నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

రాజు సుందరం కొరియోగ్రఫీలో సలార్ పాట

ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబరు 22న ఈ సినిమా విడుదల కానుంది. దీనితో సలార్ సినిమాకు సంబందించి సిమ్రత్‌కౌర్‌ తదితరులపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. రాజు సుందరం మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్న ఈ పాట అలరించేలా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా, పృథ్వీరాజ్‌ ప్రతినాయకుడి పాత్రలోనూ నటిస్తున్నారు.

Also Read : Sara Alikhan: శుభ్‌మన్‌ గిల్‌తో సారా డేటింగ్

allu arjunPrabhaspusphasalar
Comments (0)
Add Comment