Pushpa2 Update : పుష్ప‌2 రిలీజ్ డేట్ ఫిక్స్

ఆగ‌స్టు 15న ముహుర్తం ఖ‌రారు

Pushpa2 Update : పుష్ప‌2 మూవీ మేక‌ర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 15న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే విడుద‌లైన పుష్ప చిత్రం బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. ఏకంగా రూ. 500 కోట్ల క‌లెక్ష‌న్ల‌తో దూసుకు పోయింది.

Pushpa2 Update Viral

దీంతో పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప‌2 ను ప్ర‌క‌టించారు సుకుమార్. ఇందు కోసం భారీ ఎత్తున బ‌డ్జెట్ కేటాయించింది. అల్లు అర్జున్(Allu Arjun) ఇందులో కీలక పాత్ర పోషించ‌నున్నారు. శేషాచ‌లం అడ‌వుల‌లో క‌ల‌ప స్మ‌గ్లింగ్ క‌థాంశంతో పుష్ప‌ను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్.

ఈ సినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. చంద్ర‌బోస్ రాసిన పాట‌లు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. భార‌తీయ సినిమాపై చెర‌గ‌ని ముద్ర వేసింది పుష్ప ది రైజ్. సీక్వెల్ సినిమాకు అద్భుతైన ట్యాగ్ లైన్ కూడా జోడించారు. పుష్ప ది రూల్ అని పేరు పెట్టారు ద‌ర్శ‌కుడు సుకుమార్.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించారు. ర‌చ‌న‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కత్వం సుకుమార్ వ్య‌వ‌హ‌రించారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించి. జాతీయ అవార్డుల‌లో పుష్ప ది రైజ్ లో త‌న న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన అల్లు అర్జున్ కు ఉత్త‌మ న‌టుడి అవార్డు ద‌క్కింది.

Also Read : Meenakshi Chaudhary Vs Kushi

Comments (0)
Add Comment