Pushpa 2 : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 కలెక్షన్లలోనే కాదు ఓటీటీలోనూ తగ్గేదే లేదంటూ దూసుకు పోతోంది. సినీ క్రిటిక్స్ ను విస్తు పోయేలా చేసింది. ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, లవ్లీ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన పుష్ప 2 ఊహించని రీతిలో ఏకంగా వరల్డ్ వైడ్ గా 2 వేల కోట్లకు పైగా వసూలు చేసింది.
Pushpa 2 OTT Updates
మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఓటీటీలో పుష్ప 2(Pushpa 2) కి సంబంధించి అదనపు సీన్స్ జోడించింది. ఇందుకు గాను ఎక్స్ వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు. ఇది కూడా ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం.
ఇటీవలే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో పుష్ప 2 మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి. పెద్ద ఎత్తున ఆదరించారు. సినిమా యాక్షన్ సన్నివేశాలను, ముఖ్యంగా క్లైమాక్స్‌ను హైలైట్ చేయడాన్ని విదేశీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్య పోయారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించినా చిత్రం మాత్రం హాలీవుడ్ మూవీస్ కు తీసిపోని రీతిలో ఉండడంతో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.
ఈ సందర్బంగా అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ స్పందించాడు. పుష్ప2 మూవీని పాశ్చాత్య ప్రేక్షకులు పిచ్చిగా అభిమానించడం ఆనందంగా ఉందన్నాడు. రాబోయే రోజుల్లో తన సోదరుడు గ్లోబల్ స్టార్ కావడం ఖాయమన్నాడు.
Also Read : Shantanu Naidu- Shocking : టాటా మోటార్స్ జనరల్ మేనేజర్ గా శంతను నాయుడు