Pushpa 2 : 100 ఏళ్ల సినిమా చరిత్రలో ఓ సరికొత్త రికార్డు సృష్టించిన ‘పుష్ప 2’

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది...

Pushpa 2 : సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డును సృష్టించింది పుష్ప-2(Pushpa 2). విడుదల తర్వాత అది రెట్టింపు అయ్యి అంతకుమించి జోరు ప్రదర్శిస్తోంది. తాజాగా మరో అరుదైన ఫీట్‌ సాధించిందీ సినిమా. హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. రూ.632 కోట్లు కలెక్ట్‌ చేసి 100 ఏళ్ల బాలీవుడ్‌ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. విడుదలైన 6 రోజుల్లో రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

Pushpa 2 Records

ఇప్పటి వరకూ ‘కేజీయఫ్‌2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్‌ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లు దాటే దిశగా దూసుకెళ్తోంది. అయితే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు చిత్ర బృందం మరికొన్ని సన్నివేశాలు జత చేయనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయా సీన్ల రన్‌టైమ్‌ దాదాపు 20 నిమిషాలు ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 20 నిమిషాలు ఉంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటించారు. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మించింది.

Also Read : Alia Bhatt : పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్ తగ్గకుండా భారీ రెమ్యూనరేషన్ తో దూసుకుపోతున్న భామ

CinemaPushpa 2Record BreakTrendingUpdatesViral
Comments (0)
Add Comment