Pushpa 2 : టాలీవుడ్ దిగ్గజ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్-ఇండియా క్రేజ్ మరియు డిమాండ్‌ను ఆస్వాదిస్తున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు, అందరి దృష్టి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పైనే ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Pushpa 2 Updates
అత్యంత అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 చిత్రం హిందీ వెర్షన్ పంపిణీ హక్కులు 200 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. ఈ వార్త విని అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2‘ తెరకెక్కుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాని పాన్-ఇండియ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు.
Also Read : Chiyaan Vikram : చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్’ సినిమాలో సిద్ధికి